– బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడమే నా లక్ష్యం అని ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. ఆదివారం దూదేకుల బజారులో నల్లాల లీకేజీలను బురదమయం లేకుండా చెత్తాచెదాలను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బజారులో నల్లాల పైపులు లీకేజీ అయి కొన్ని పైపులు పగిలి అందులో నుండి నీరు బయటకు వచ్చి దురదమయంగా మారి రహదారి ఇబ్బందిగా ఉండడంతో ఆ బజారు వాసులు దీన్ని క్లీన్ చేయాలని కోరిన వెంటనే స్పందించి ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ డోజర్ సహాయంతో మట్టిని బురదను తొలగించి పగిలిన పైపులను అతుకు పెట్టి ఆ బజారుకు నీరు అందించి కార్యక్రమాన్ని చేశామని అన్నారు. గ్రామంలో ఏ విధుల్లో కూడా ఏ సమస్య లేకుండా త్వరలోనే పరిష్కార మార్గంగా ముందుకు సాగుదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిట్టల మురళి అజీమ్ ఉమేష్ ప్రశాంత్ యాకుబ్ పాష తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


