Sunday, December 28, 2025
E-PAPER
Homeఖమ్మంఎన్ఎస్ఎస్ వాలంటీర్ అంటే దేశ సేవకుడు

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అంటే దేశ సేవకుడు

- Advertisement -

– ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ కామేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ఎన్ఎస్ఎస్ అంటేనే సేవ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గా ఉండడం అంటే దేశానికి సేవకుడిగా ఉన్నట్లేనని, ఎన్ఎస్ఎస్ ద్వారా సామాజిక సేవ నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం ప్రతి వాలంటీర్ బాధ్యతగా స్వీకరించాలి, నేను కూడా చదువుకునే రోజుల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ డాక్టర్ వేముల కామేశ్వరరావు తెలిపారు. అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏడు రోజుల శీతాకాల ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ అల్లు అనిత  అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఏడు రోజుల శీతాకాల ప్రత్యేక శిబిరం విజయవంతంగా ముగించి నందుకు ప్రిన్సిపాల్ అనిత, పిఓ డేగల నరసింహారావు, ఏపీఓ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన నారం వారిగూడెం సర్పంచ్ మనుగొండ నాగమణి మాట్లాడుతూ విద్యార్థులు చదువు,సేవ రెండు కళ్ళు భావించాలని మీరు భవిష్యత్తులో ఈ దేశానికి మరిన్ని సేవలు చేయాలని విద్యార్థులకు సూచించారు.

గ్రామ పరిపాలన అధికారి శ్రీ తిరుపతి రావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతోపాటు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు.  ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఏడు రోజుల శీతాకాల ప్రత్యేక శిబిరం పాత నారం వారి గూడెంలో ఏర్పాటుచేసి మాకు సాధ్యమైనంత వరకు పరిసరాల శుభ్రత డ్రైనేజీ ల క్లీనింగ్, రోడ్లు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం ద్వారా సామాజిక సేవను బాధ్యతగా తీసుకున్నాం.భవిష్యత్తులో మా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.

ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డేగల నరసింహారావు మాట్లాడుతూ కళాశాలకు ఎన్ఎస్ఎస్ యూనిట్ రావడంలో శీతాకాల ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడానికి ముందుండి మమ్ములను ప్రోత్సహించి మాతో పాటు శీతాకాల ప్రత్యేక శిబిరంలో అవిశ్రాంత కృషి చేసిన మా ప్రిన్సిపాల్ అనిత కు ప్రత్యేకంగా వాలంటీర్లు తరఫున మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం అన్నారు. అలాగే ప్రత్యేక శిబిరం ఏర్పాటుకు అనుమతించిన కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ గారికి అలాగే మాకు సహకరించిన ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ డాక్టర్ వేముల కామేశ్వరరావు కు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఏపీవో మానె శ్రీనివాసరావు హ,గ్రామ పెద్దలు వెంకటేశ్వరరావు గారు కళాశాల అధ్యాపకులు అరవింద్ బాబు,శివ సాయి,ప్రసాద్,చాంద్ పాషా, గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -