- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ సోమాజిగూడలోని కత్రీయ హోటల్ సమీపంలో గల ఒక అపార్ట్‌మెంట్‌లో సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమయానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -



