సంక్షేమ పథకాలే మరోసారి అధికారంలో కూర్చోబెడతాయి

నవతెలంగాణ-హన్మకొండ
వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం లో 62 వ డివిజన్‌ అధ్యక్షులు పాలడుగుల శివ కుమార్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నుండి యువత బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినరు భాస్కర్‌ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ బి ఆర్‌ ఎస్‌ పార్టీ అభ్యర్థి దాస్యం వినరు భాస్కర్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయో గ్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అమలు పరుస్తున్నటువంటి ఘనత సీఎం కేసీఆర్‌ కు దక్కుతుందన్నారు.అలాంటి పథకాలే బిఆర్‌ఎస్‌ పార్టీని మరొక్క మారు అధికారంలోకి తేనున్నాయన్నారు.తెలంగాణ రాష్ట్రంలో యువత అభివద్ధి కోసం విద్యారంగంలో, వైద్యరంగంలో,ఐటీ రంగంలో ఎనలేని అభివద్ధి సాధిం చిందన్నారు.62 వ డివిజన్‌ కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కుమ్మరి సు ధాకర్‌, అశోక్‌, రమేష్‌, రవీందర్‌,రాజేష్‌,సునీల్‌, ఠాగూర్‌, మధు, రవి,రవీందర్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ఇంచార్జ్‌ కష్ణ,సీనియర్‌ నాయకులు నార్లగిరి రమేష్‌, జన్ను జకార్య, రాజ్‌కుమార్‌, రఘురాం,రాజేందర్‌,శ్రీనివాస్‌, ప్రభాకర్‌, పరమేష్‌ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
31వ డివిజన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరిక
సీఎం కేసీఆర్‌ చేసిన అభివద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు నచ్చే ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఆదరిస్తున్నారని, పశ్చిమ ప్రజలు వినయన్న వెంటే అని కుడా చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌ రాజ్‌యాదవ్‌ అన్నారు. 31 వ డివిజన్‌ న్యూ శాయం పేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఆదెబస్వరాజుకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సుందర్‌రాజ్‌ యాదవ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని అన్నారు. పశ్చిమ నియోజకర్గ అభివద్ధి ప్రధాత దాస్యం వినరు భాస్కర్‌ అని అన్నారు. నియోజకవర్గ అభివద్ధికి రూ.5 వేల కోట్లు నిధులు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనన్నారు. ఈ కార్యక్రమం లో 31 వ డివిజన్‌ కార్పొరేటర్‌ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్‌ మాడిశెట్టి శివశంకర్‌, డివిజన్‌ ఇంచార్జి జోరిక రమేష్‌, ఆదె ఉమేష్‌, కామగోని వెంకటేశ్వర్లు, పద్మచారి, సజన్‌, రాచమళ్ళ మధు, కలకొట్ల ఉమేష్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
47వ డివిజన్లో బీఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం
కాజీపేట: పట్టణంలోని 47వ డివిజన్‌ 147వ బూత్‌ కెప్టెన్‌ గబ్బెట శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి దాస్యం వినరు భాస్కర్‌ కు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శుక్రవారం రైల్వే రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులను కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంపల్లి లక్ష్మణ్‌, కొంకటి శరత్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌ గబ్బెట కరుణ్‌, గాజుల విజరు, కొండేటి రోహిత్‌, ఎనగందుల మాలతి, నాయిని విజయ, కాలేశ్వరం రేణుక తదితరులు పాల్గొన్నారు.

Spread the love