Monday, December 29, 2025
E-PAPER
Homeఆటలురేసులోనే గుకేశ్‌, అర్జున్‌

రేసులోనే గుకేశ్‌, అర్జున్‌

- Advertisement -

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్స్‌

దోహా (ఖతార్‌) : ఫిడె ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్‌, అర్జున్‌ ఎరిగేశిలు తొమ్మిది రౌండ్ల అనంతరం రేసులోనే కొనసాగుతున్నారు. 6.5 పాయింట్లతో గుకేశ్‌, అర్జున్‌లు సంయుక్తంగా ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నారు. రష్యా గ్రాండ్‌మాస్టర్‌ వ్లాడిస్లావ్‌ అర్టెమీవ్‌ హాన్స్‌ నీమాన్‌లు 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. డెన్మార్క్‌ జీఎం అనీశ్‌ గిరి, అలెక్సీ సరనాలతో రెండు గేమ్‌లను డ్రా చేసుకున్న గుకేశ్‌.. స్పెయిన్‌ జీఎం డెవిడ్‌ అంటోన్‌పై ఎనిమిదో రౌండ్లో విజయం సాధించాడు. తొమ్మిదో రౌండ్లో నొడిబెక్‌ చేతిలో కింగ్స్‌ ఇండియన్‌ ఎటాక్‌లో ఓటమి చెందాడు. తొమ్మిది రౌండ్లలో గుకేశ్‌కు ఇదే తొలి ఓటమి. మాగస్‌ కార్ల్‌సన్‌పై విజయంతో వ్లాడిస్లావ్‌ ముందంజలో కొనసాగుతుండగా.. ఎనిమిదో రౌండ్లో మాగస్‌ కార్ల్‌సన్‌ పుంజుకున్నాడు. అమెరికా జీఎం శాంత్‌పై గెలుపొందాడు. ఓపెన్‌ విభాగంలో 13 మంది పోటీపడుతుండగా.. తొమ్మిది రౌండ్ల పోటీలు ముగిసినా టాప్‌-2 స్థానాల్లో నలుగురు జీఎంలు పోటీపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -