Monday, December 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంత్రిబుల్‌ ఆర్‌ రైతుల కోసం పోరాడుతా

త్రిబుల్‌ ఆర్‌ రైతుల కోసం పోరాడుతా

- Advertisement -

ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : కవిత

నవతెలంగాణ-తలకొండపల్లి, ఆమనగల్‌
త్రిబుల్‌ ఆర్‌ రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి కడ్తాల్‌ మండలం సాలార్‌పూర్‌లో బస చేసిన కవిత ఆదివారం ఉదయం ఆమనగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని గుర్రగుట్ట కాలనీలో పర్యటించారు. కాలనీ సమీపంలో ఇండ్ల మధ్య ఉన్న డంపింగ్‌ యార్డ్‌ను ఆమె పరిశీలించారు. అలాగే తలకొండపల్లి మండల పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలోని త్రిబుల్‌ ఆర్‌లో భూమిని కోల్పోతున్న రైతులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిహారం కాదు తమ భూములు తమకు కావాలని రైతులు అడిగితే అధికారులు స్పందించడం లేదన్నారు. చిన్న, సన్నకారు రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆమగనల్‌లో ఉన్న డంపింగ్‌ యార్డ్‌ను నివాసాలకు దూరంగా తరలించాలని స్థానిక ఎమ్మెల్యేకు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, మాజీ ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలంగౌడ్‌, జంగారెడ్డిపల్లి సర్పంచ్‌ పసుల మల్లేష్‌, గడ్డమీది తండా మాజీ సర్పంచ్‌ ఈశ్వర్‌నాయక్‌, ఉపసర్పంచ్‌ మంజుల వెంకట్‌రెడ్డి, వార్డ్‌ సభ్యులు శేఖర్‌గౌడ్‌, రజిత రమేష్‌, పావని కృష్ణయ్య, లక్ష్మమ్మ కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -