Monday, December 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఐ-బొమ్మ నిర్వాహకుడు రవి కేసులో కీలక పరిణామం

ఐ-బొమ్మ నిర్వాహకుడు రవి కేసులో కీలక పరిణామం

- Advertisement -

ప్రహ్లాద్‌ వెల్లేల పేరుతో పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌
ఇమంది రవి ఎవరో నాకు తెలియదు…: ప్రహ్లాద్‌


హైదరాబాద్‌: ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రహ్లాద్‌ వెల్లేల పేరుతో రవి.. పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నాడు. అతను తన రూమ్‌మేట్‌ అని గతంలో పోలీసు విచారణ సందర్భంగా చెప్పాడు. దీంతో బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించిన పోలీసులు.. కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే అతన్ని విచారించారు. ”ఇమంది రవి ఎవరో నాకు తెలియదు. నా పేరుతో రవి పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నట్టు తెలిసి షాక్‌ అయ్యా” అని ప్రహ్లాద్‌ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం అతను బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ప్రహ్లాద్‌ డాక్యుమెంట్లు ఇమంది రవి దొంగిలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రేపటితో ఇమంది రవి పోలీసు కస్టడీ ముగియనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -