నవతెలంగాణ – సుల్తాన్ బజార్
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్క రించుకొని గోషామహల్ నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా గోషామహల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు మెర్సి ప్రియాంక మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశ స్వాతంత్ర్యానికి పునాది వేసిన పార్టీ కాంగ్రెస్ అని, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.1885 డిసెంబర్ 28న బొంబాయిలో 72 మంది సభ్యులతో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్న పార్టీగా ఎదిగింది అని తెలిపారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిం దని గుర్తు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో అనేక మంది తమ కుటుంబాలను, ఆస్తులను త్యాగం చేసి, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గారని తెలిపారు. స్వాతంత్ర్యం అనంత రం తీవ్రమైన పేదరిక పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన సేవలు మరువలేనివన్నారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు.



