Monday, December 29, 2025
E-PAPER
Homeఖమ్మంకమ్యూనిస్టు దేశాలపై పెపోతున్న సామ్రాజ్యవాద దేశాలు దాడులు, అరాచకాలు

కమ్యూనిస్టు దేశాలపై పెపోతున్న సామ్రాజ్యవాద దేశాలు దాడులు, అరాచకాలు

- Advertisement -

జనవరి 3 న మధిరలో భారీ నిరసన ర్యాలీ 
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు 
నవతెలంగాణ – బోనకల్ 

ప్రపంచంలో కమ్యూనిస్టు దేశాలపై సామ్రావాద దేశాల దాడులు ప్రధానంగా అమెరికా దాడులు, అరాచకాలు పెరిగిపోతున్నాయని దీనిని కమ్యూనిస్టు దేశమైన చైనా ధీటుగా ఎదుర్కొంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలో అనే బోనకల్ మండల కేంద్రంలోని ఎస్.డి.ఆర్ ఫంక్షన్ హాలు నందు మధిర నియోజకవర్గ సీపీఐ(ఎం) విస్తృతస్థాయి సమావేశం సోమవారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.

తొలుత సంతాప తీర్మానాన్ని సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు సీలం నరసింహారావు ప్రవేశపెట్టారు. అనంతరం పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం నిర్వహించిన న్యూయార్క్ మేయర్ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి  జోహారాన్ మందాని మూడు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారన్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు కోలుకోవాలని దెబ్బ తగిలింది అన్నారు. కమ్యూనిస్టు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ దాడులు చేస్తున్నారని విమర్శించారు. అమెరికా చేస్తున్న దాడులను చైనా దేశం గట్టిగా తిప్పుకొడుతుంది అన్నారు. ప్రపంచంలో కమ్యూనిస్టు చైనా దేశం అత్యంత వేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందన్నారు. చైనా గంటకు 700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైల్వే వ్యవస్థను రూపొందిస్తుందన్నారు. చైనా పేదరికం లేని దేశంగా తయారైందన్నారు.

అదేవిధంగా భారతదేశంలో కేరళ నిరుపేదలు లేని రాష్ట్రంగా తయారుచేసిన ఘనత సీపీఐ(ఎం)కే దక్కిందన్నారు. కేరళలో సీపీఐ(ఎం) ప్రభుత్వం ప్రతి పది నిమిషాలకు ఒక ఇంటిని నిర్మించి పేదవాళ్లకు అప్పగించిందన్నారు. పేదలను అభివృద్ధి చేసే విధానాలను, ఆలోచనాలను కమ్యూనిస్టులు మాత్రమే చేస్తారన్నారు. మధిర నియోజకవర్గంలో సీపీఐ(ఎం) కార్యకర్తలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి మల్లు నందిని అక్రమ కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. భట్టి విక్రమార్క, మల్లు నందిని రౌడీయిజం, గూండాయిజం ఎంతోకాలం కొనసాగదని, తాము ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతు, వ్యవసాయ కూలీల, కార్మికుల వ్యతిరేక చట్టాలను తీసుకువస్తుందని విమర్శించారు.

ఇందులో ప్రధానంగా జాతీయ గ్రామాన్ని ఉపాధి హామీ చట్టాన్ని బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, ఈ చట్టం పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. దేశంలో ఎంతోమంది నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని బిజెపి రద్దు చేయటం పట్ల తీవ్రంగా ఖండించారు. హక్కుల సాధన కోసం పోరాటాలే పరిష్కార మార్గాలన్నారు. దేశంలో బిజెపి పరిపాలనలో మతోన్మాదం పెచ్చిరిల్లు పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు క్రిస్టియన్ చర్చిలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రార్ధనలు చేస్తుంటారు, మరొకవైపు అదే చర్చిలపై క్రిస్టియన్ల పై బిజెపి, ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ దాడులు చేస్తుంటారని విమర్శించారు. మధిర నియోజకవర్గంలో మల్లు భట్టి విక్రమార్క, మల్లు నందిని అక్రమాలు, దాడులు పెరిగిపోయాయి అన్నారు. అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలని హితవు పలికారు. సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు చేస్తారు, మరల వారిపైనే పోలీసులతో మల్లు భట్టి విక్రమార్క, మల్లు నందిని  ప్రోద్బలంతో అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.

మధిర నియోజకవర్గంలో అనేక ప్రధాన గ్రామాలలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందన్నారు. ఈ ఓటమిని తట్టుకోలేక సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని హత్యాయత్నం కేసులు నమోదు చేయిస్తున్నారని విమర్శించారు. మల్లు భట్టి విక్రమార్క, మల్లు నందిని గుండాయిజం, రౌడీయిజంకు, సీపీఐ(ఎం) కార్యకర్తలపై అక్రమ కేసులకు నిరసనగా జనవరి 3వ తేదీన మధిర నియోజకవర్గం కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి పద్మ, జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడారు. ఈ సమావేశంలో మధుర నియోజకవర్గంలోనే వివిధ మండలాల కార్యదర్శులు కిలారు సురేష్, మందా సైదులు, పడకంటి మురళి, డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు పాపినేని రామ నర్సయ్య, పయ్యావుల ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0;
hdrForward: 0; shaking: 0.024284; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 8;
brp_del_th: 0.0017,0.0000;
brp_del_sen: 0.1000,0.0000;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 3145728;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 33;
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -