Monday, December 29, 2025
E-PAPER
Homeఖమ్మంరిజర్వేషన్లకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూర్తిగా వ్యతిరేకం 

రిజర్వేషన్లకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూర్తిగా వ్యతిరేకం 

- Advertisement -

బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయటం లేదు 
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు 
నవతెలంగాణ – బోనకల్ 

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా ప్రకటించారని, కానీ ఎందుకు అమలు చేయలేదు సమాధానం చెప్పాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు నిలదీశారు. రిజర్వేషన్లకు బిజెపి ఆర్ఎస్ఎస్ పూర్తి వ్యతిరేకమన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని సీపీఐ(ఎం) మధిర నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం బోనకల్ మండల కేంద్రంలోని ఎస్డిఆర్ ఫంక్షన్ హాల్ నందు ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2026 సంవత్సరం పోరాటాలకు నిలయం కానున్నది అన్నారు. అనేక రకాల సమస్యలు మన ముందుకు వస్తున్నాయన్నారు. వాటిని పోరాటాల ద్వారా పరిష్కారం చేసుకోవాలని అందుకు సీపీఐ(ఎం) శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రధానంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలలో పట్టు సాధించాలంటే మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్వహించవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. రాబోయే ఎంపీటీసీ జడ్పిటిసి మున్సిపల్ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విధానాన్ని సీపీఐ(ఎం) పూర్తిగా సమర్థిస్తుందని కానీ అది అమలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వంపై 42 శాతం రిజర్వేషన్ అమల కోసం ఎందుకు పోరాటం చేయడం లేదు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపిని మెడలో ఉంచి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందని వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని విమర్శించారు. సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహించకుండా నామినేటెడ్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని ఆ విధానాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. నామినేటెడ్ విధానం వలన సహకార సంఘాలు నిర్వీర్యం అవుతాయని దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. చిరుమర్రి ముదిగొండ బోనకల్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతి ఘోరంగా ఓడిపోయిందన్నారు. సీపీఐ(ఎం), బీఆర్ఎస్ అభ్యర్థులు అఖండ విజయం సాధించారన్నారు. గ్రామాలలో అతి తక్కువ తేడాతో ఓడిపోయామన్నారు. ఖమ్మం జిల్లాలో 64 స్థానాల్లో పోటీ చేసి 26 స్థానాల్లో విజయం సాధించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన లోపాలను సరిదిద్దుకొని రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి పద్మ, సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు చింతల చెరువు కోటేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడారు. ఈ సమావేశంలో మధిర నియోజకవర్గంలోని మండలాల కార్యదర్శులు మంద సైదులు, పడకంటి మురళి, కిలారి సురేష్, బట్టు పురుషోత్తం, డివిజన్ కార్యదర్శి సభ్యులు పాపినేని రామ నర్సయ్య, సేలం నరసింహారావు, పయ్యావుల ప్రభావతి, నియోజకవర్గంలోనే నూతన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, మండలాల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -