- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి
ఎంతో విలువైన భగీరథ మంచినీటి సరఫరా జలాలు వృథా పోతున్నప్పటికీ రక్షిత మంచినీటి సరఫరా అధికారుల్లో నిర్లక్ష్యం కనిపిస్తున్నది. మండలంలోని మగ్దూంపల్లి వద్ద జహీరాబాద్ వైపు సరఫరా చేసే మిషన్ భగీరథ వాల్వ్ లీకేజీ కారణంగా రోజు వందలాది లీటర్ల నీరు జాతీయ రహదారిపై పారుతోంది. దీంతో స్థానికులు జెసిబితో గుంత ఏర్పాటు చేసి నీటిని జాతీయ రహదారిపై వెళ్లకుండా అక్కడే అక్కడే నిల్వ అయ్యే విధంగా గుంతను ఏర్పాటు చేశారు. ఇకనైనా అధికారులు మొద్దు నిద్రను వీడి వాల్వు మరమ్మతు చేసి నీటి వృధాను అరికట్టాలని స్థానికులు చేస్తున్నారు.
- Advertisement -



