Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిప్రి ఉపాధ్యాయునికి తిరుపతి జాతీయ సదస్సులో ప్రశంసలు

పిప్రి ఉపాధ్యాయునికి తిరుపతి జాతీయ సదస్సులో ప్రశంసలు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల (అటానమస్)లో ఈ నెల 26,27 తేదీలలో  జరరిగిన “అన్నమయ్య కీర్తనలు- ఆధ్యాత్మికత” రెండు రోజుల జాతీయ సదస్సులో 27న సదస్సు నిర్వహించారు. మండలం  లోని  పిప్రి గ్రామ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గోవింద్ పేట్ గ్రామానికి చెందిన డాక్టర్ బాదరవేణి నాగరాజు, ” అన్నమాచార్య సంకీర్తన – సూక్తి సుధాకరం”  అనే అంశంపై తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. నాగరాజు తన ప్రసంగంలో అన్నమయ్య తన సంకీర్తనల్లో పేర్కొన్న సూక్తులపై లోతైన విశ్లేషణ చేశారు. 

ఈ కార్యక్రమంలో ఎస్వీ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ డా.వేణుగోపాల్ రెడ్డి, తెలుగు శాఖాధిపతి(కన్వీనర్) డా.ఎన్.భీమన్న , ఇతర సాహితీవేత్తలు పాల్గొన్నారు.ఈ సమావేశంలో సభికులు నాగరాజు పత్ర సమర్పణలోని లోతైన విశ్లేషణను ప్రశంసించినట్టు సోమవారం తెలిపారు. నాగరాజు ఈ మధ్యనే మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం, బెంగళూరు విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుల్లో కూడా పత్ర సమర్పణ చేసి, అందరి ప్రశంసలు పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -