Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు రెవెన్యూ డివిజన్ కోసం అసెంబ్లీలో చర్చ

ఆలేరు రెవెన్యూ డివిజన్ కోసం అసెంబ్లీలో చర్చ

- Advertisement -

ఆలేరులో అఖిలపక్షం హర్షం 
నవతెలంగాణ – ఆలేరు 

ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య రాష్ట్ర అసెంబ్లీలో చర్చ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేస్తూ ఆలేరు డివిజన్ కేంద్రం కావాలని అఖిలపక్షాలు కోరుతున్నాయని భౌగోళికంగా అతి పెద్దగా ఉన్న ఆలేరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్  ఏర్పాటు చేసినట్లయితే ఆయా ప్రాంత మండల ప్రజలకు దూర భారం తగ్గి అన్ని విధాలుగా ఆలేరు అభివృద్ధితోపాటు పరిపాలన సౌలభ్యం కోసం ఉపయోగపడుతుందన్నారు.

రాజపేట మండలం విస్తీర్ణంలో చాలా పెద్దగా ఉందని రఘునాథపురం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి గ్రామాలు పర్యటించినప్పుడు ఆమ్లెట్ గ్రామాలలో రేషన్ బియ్యం తీసుకోవడం వృద్ధుల కష్టమవుతుందన్నారు. ఆమ్లెట్ గ్రామాలలో కూడా మినీ రేషన్ పంపిణీ బ్రాంచ్ లను ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు మేలు చేసిన వారమవుతామన్నారు.

అఖిలపక్ష నాయకులు హర్షం 
ఆలేరు రెవెన్యూ డివిజన్ కోసం ప్రభుత్వం బీర్ల ఐలయ్య అసెంబ్లీలో చర్చించడం పట్ల ఆలేరులోని అఖిలపక్ష నాయకులు హర్షం ప్రకటించారు. ఆలేరు లోని ఆర్యవైశ్య భవన్ లో సోమవారం నాడు అఖిలపక్ష నాయకులు సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వ విప్ రెవెన్యూ డివిజన్ అయ్యే వరకు వెంటపడి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి తొందరగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే నియోజవర్గ ప్రజలే ప్రభుత్వవిప్ కు జేజేలు పలుకుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు సింగిల్ విండో జిల్లా మాజీ డైరెక్టర్ మొరిగాడి చంద్రశేఖర్, పసుపునూరి వీరేశం, రాచకొండ జనార్ధన్, కళ్లెపు అడవయ్య, ఎండి సలీం, చెక్క వెంకటేష్, పాశికంటి శ్రీను, కెమిడి ఉప్పలయ్య, కామాటికారి అశోక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -