Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గాదరి

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గాదరి

- Advertisement -

నవతెలంగాణ – అడ్డ గూడూరు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ బాలెంల త్రివేణి భర్త దుర్గయ్య కాలుకు శస్త్రచికిత్స చేయించుకొని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని మాజీ తుంగతుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్  పరామర్శించారు. అదేవిధంగా ధర్మారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జక్కుల యాదగిరి మాతృమూర్తి మరియమ్మ  ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ధర్మారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కప్పల సింగరయ్య ఇటీవల మరణించడంతో వారి  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితోపాటు బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -