Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణికి అధికారుల డుమ్మా..

ప్రజావాణికి అధికారుల డుమ్మా..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల ప్రజలు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల తహశీల్దార్ ఎండి ముజీబ్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఆ నాలుగు శాఖల అధికారులు మాత్రమే హాజరు కావడం కనిపిస్తోంది. మిగతా శాఖల అధికారులు హాజరుకాకపోయినా వారిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు తరచూ నిర్లక్ష్యం వహిస్తున్నారని వినికిడి. ఇప్పటికైనా ప్రజవాణికి అధికారులందరూ హాజరై ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, ఎంపీఓ వెంకట నరసయ్య, ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్, ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి పద్మ, ఆరోగ్యశాఖ ఏఎన్ఎం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -