నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగుల్గావ్ గ్రామంలో సాగు అవుతున్న శెనగ, జొన్న , కంది పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు తగు సలహాలు సూచనలు చేశారు. శెనగ పంటలో ముఖ్యంగా అక్కడక్కడ ఎండు తెగులు ఉధృతిని గమనించి దాని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ (సిఓసి) లీటరు నీటికి 3గ్రాములు లేదా ట్యూబాకోనజోల్ 2 గ్రా” లీటరు నీటికి కలిపి మొక్క బాగా తడిచేలా పిచికారి చేయాలని తెలిపారు. అదేవిధంగా శెనగ పచ్చ పురుగు వచ్చే అవకాశం ఉన్నందున దాని నివారణకు ఎమామెక్సన్ బెంజోట్ ( ఇఎమ్1) 100 గ్రాములు లీటరు నీటికి + వేప నూనె (1500 సిపిఎం) 500 ఎమ్ఎల్ ఎకరాకు లేదా నోవోలురాన్ 300 ఎమ్ఎల్ ఎకరాకు కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది.
జొన్న పంటలో ఎరువుల యాజమాన్యం గురించి కూగా వారు క్షణ్ణంగా వివరించారు. ఒక ఎకరా జొన్న పంట కోసం యూరియా 77కిలోలు, డిఎపి 52 కిలోలు, పొటాష్ 27కిలోలు అవసరం ఉంటది అని తెలిపారు. జొన్న పంటలో ప్రధానంగా కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు ఉధృతిని గమనించి దాని నివారణకు ఎమ్కక్టిన్ బెంజోట్ ఈఎమ్1, 100గ్రాములు లేదా ప్రోఫేనోస్ 50 ఈసీ 400ఎమ్ఎల్ ఎకరాకు లేదా నోవాలురాన్+ ఎండాక్సీ (ప్లేతోర్నా) 100ఎమ్ఎల్ ఎకరాకు దానితో పాటు వేప నూనె (1500 పిపిఎం) ఎకరాకు 1500 ఎమ్ఎల్ కలిపి మొక్క సుడిలో మందు పడేలా పిచికారి చేయాలని వెల్లడించారు. ఈ క్షేత్ర స్థాయి సందర్శనలో రైతు సోదరులు గుండెవర్ ఉమేష్, హుడేకర్ రవిదాస్, గుండెవర్ సునీల్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.



