నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామ పెద్దలు వ్యాపారవేత మండల కేంద్ర అభివృద్ధి పనులకు భూదాత అయిన వేణుగోపాల్ ఇనానికి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి గుర్తింపు తెచ్చారు. ఆయన విగ్రహం వద్ద అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా సోమవారం వేణుగోపాల్ ఈనాని వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సర్పంచ్ నివాళులర్పించారు. సర్పంచ్ తో పాటు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు పూలమలలతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ మాట్లాడుతూ.. మద్నూర్ మండల కేంద్రం అభివృద్ధికి ఇనాని కుటుంబం ఎకరాల కొద్ది భూమిని అందించడం మూలంగానే అనేక రకాల అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రికి గానీ బాలుర గురుకుల పాఠశాల గాని ప్రభుత్వ జూనియర్ కళాశాల గాని ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఇనాని కుటుంబం ఎకరాలకు వచ్చి భూమిని ప్రభుత్వానికి అందించిన మూలంగానే ఆ శాఖలు అభివృద్ధి చెందాయని అన్నారు. అలాంటి భూదాతకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ప్రత్యేకంగా గుర్తించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.



