వర్ధంతి సభలో ఎంఎల్ఏ, ఎమ్మెల్సీ
నవతెలంగాణ – మిర్యాలగూడ
ప్రజలతో నిత్యం మమేకమైన,ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా పని చేసిన ప్రజాబంధువుడు దీరవత్ రాగ్యా నాయక్ అని ఎంఎల్ఏ బత్తుల లక్ష్మారెడ్డి, ఎంఎల్సీ కేతవత్ శంకర్ నాయక్ ,మాజీ చీఫ్ విప్ దీరవత్ భారతి రాగ్యనాయక్ లు అన్నారు. సోమవారం రాగ్యానాయక్ 29వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడలోని సాగర్ రోడ్డులో గల విగ్రహానికి, రాజీవ్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్లో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రాగ్యానాయక్ లేని లోటు గిరిజన సమాజానికి తీరలేనిదని అన్నారు.
ప్రజలతో మమేకై ప్రజల ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారిని చెప్పారు. ఆయన లేని లోటును ఎవరు పూడ్చలేరను చెప్పారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు దీరవత్ స్కైలాబ్ నాయక్, పీసీసీ సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, కాంత రెడ్డి, తలకొప్పుల సైదులు, మాన్య నాయక్,నాగు నాయక్,రవితేజ నాయక్,శ్రీహరి నాయక్, దాస్య నాయక్, నానిక్య నాయక్,భాష్యా నాయక్,భీమ్ల నాయక్,మక్లా నాయక్,బాలాజీ నాయక్,ఠాగూర్ నాయక్,శ్రీను నాయక్,విజయ్ నాయక్, నరీ నాయక్, లక్ష్మన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



