– సర్పంచ్ బెజ్జారపు రాకేష్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పశు వైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని గొర్లు, మేకల కాపలదారులు సద్వినియోగం చేసుకోవాలని కోన సముందర్ సర్పంచ్ బెజ్జరపు రాకేష్ అన్నారు. సోమవారం మండలంలోని కోన సముందర్ లో పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొర్లు, మేకల కాపలదారుల సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నట్టల నివారణ పంపిణీ కార్యక్రమాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా గొర్ల మేకల కాపలాదారులు తమ జీవాలను అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. జీవాలకు ప్రతి మూడు నెలలు ఒకసారి నట్టల నివారణ మందు వేయించాలని చౌట్ పల్లి పశువైద్యాధికారి డాక్టర్ వసంత్ కుమార్ సూచించారు.కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సత్యం, గోపాలమిత్త స్వరన్, గొర్ల మేకల కాపలదారులు, తదితరులు పాల్గొన్నారు.



