Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను  సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్  సమావేశ  మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 24 అర్జీలను, జిల్లా కలెక్టర్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు  తో కలసి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. స్టేట్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి పరిష్కరించాలన్నారు.

అందులో రెవిన్యూ శాఖ 16 ,జిల్లాపంచాయతీ 3 విద్యా శాఖ 2, మున్సిపాలిటీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి, ఎంప్లాయిమెంట్  శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం  మండల తాసిల్దార్, మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్షిస్తూ భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. భూ భారతిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులని పరిశీలించి, ఆయా మాడ్యూల్స్ లో  భూములకు సంబంధించిన దరఖాస్తులను  క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలన జరిపి అర్హులుగా నిర్ధారణ అయిన వారి దరఖాస్తులను ఆమోదించాలన్నారు. ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే, అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని, అవి భూభారతి మార్గదర్శకాలకు లోబడిఉండాలన్నారు.మండల స్పెషల్ ఆఫీసర్లు మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

 అనంతరం గురుకులాల,వివిధ సొసైటీల రెసిడెన్షిషియల్ పాఠశాలలో బ్యాక్ లాగ్, కొత్త అడ్మిషన్ లకు సంబందించిన అర్హత పరీక్ష పోస్టర్ ని కలెక్టర్ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి,హౌసింగ్ పిడి విజయసింగ్ వివిధ శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -