నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం బిఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన అయ్యప్ప మహాశస్త్ర సేవా ట్రస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ సెక్రటరీ రావుల నాగరాజు గురుస్వామికి సంబంధించిన 2026 సంవత్సరం క్యాలెండర్ ను మహేష్ గురుస్వామి ఆధ్వర్యంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్ గురు స్వామి మాట్లాడుతూ .. గత 20 సంవత్సరాలుగా మొహన్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలవేసుకుంటూ అయ్యప్ప సేవ సమాజానికి, శబరిమలో జరుగు నిత్యాన్నదానానికి తనవంతు సహకారం చేస్తున్న రావుల నాగరాజు గురుస్వామి ని మహేష్ గురుస్వామి, అయ్యప్పస్వాములు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల సుధీర్ రెడ్డి స్వామి,జిన్న ప్రవీణ్ స్వామి,దొంకేన ఉమేష్ స్వామి,నకిరేకంటి పాండు స్వామి,సురేష్ స్వామి లు పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



