- Advertisement -
సర్పంచ్ కు వార్డు సభ్యుల వినతి
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ మండలంలోని కొత్తగూడెం గ్రామం తొమ్మిదవ వార్డులో డ్రైనేజీ, మంచినీటి, కరెంటు సమస్య లను పరిష్కరించాలని సోమవారం గ్రామ సర్పంచ్ పిసిక ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. 9 వార్డులో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వాటిపై దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పరంగి శైలజ మధు, కార్యకర్తలు మాసారపు మహేష్, పరంగి సన్నీ, మాతంగి సైదులు, మీసాల అశోక్, ఉబ్బపల్లి దాసు, పేరుపొంగు నగేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



