Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అగ్నివీర్ జవాన్లకు ఘన సన్మానం

అగ్నివీర్ జవాన్లకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
భారత సైన్యంలోని అగ్నివీర్ కు ఎంపికైన బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థులు బి.ఎ విద్యార్థి పాంచాల్ హనుమంత్ ఒడిశాలోని ఏఏడి సెంటర్లో ఆరు నెలల శిక్షణ పూర్తిచేసి రాజస్థాన్ లోని సూరత్ ఘడ్ లో పోస్టింగ్, బి.జడ్.సి  విద్యార్థి బాలాజీ భోపాల్ 3 ఈఏంఈ సెంటర్లో ఆరునెల శిక్షణ పూర్తి చేసుకొని గుజరాత్ లో పోస్టింగ్ పొందిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్  అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ .. కళాశాల విద్యార్థులు దేశసేవలో భాగం కావడం దేశ రక్షణ కోసం ఎంపిక కావడం సంతోషకరమని అన్నారు. వారి క్రమశిక్షణ, పట్టుదలను కొనియాడుతూ అగ్నివీర్ కు ఎంపికైన వారిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని దేశసేవలో భాగం కావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -