Monday, December 29, 2025
E-PAPER
Homeకరీంనగర్కేకే కు తగిన స్థానం కల్పించాలని గాంధీభవన్ కు తరలిన కాంగ్రెస్ నేతలు

కేకే కు తగిన స్థానం కల్పించాలని గాంధీభవన్ కు తరలిన కాంగ్రెస్ నేతలు

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఇప్పటివరకు ఏ పదవి లేకున్నా నియోజకవర్గ ప్రజల గురించి నియోజకవర్గ అభివృద్ధి గురించి అహర్నిశలు కష్టపడుతూ ప్రజలతో మమేకమై ఉంటున్నారని సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులు అన్నారు. అటువంటి ఉద్యమ నాయకున్నీ అధిష్టానం విస్మరించడం తగదనీ, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ కు తరలి వెళ్లారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ యుఐ నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, హైదరాబాదుకు భారీగా తరలివెల్లి కాంగ్రెస్ అధిష్టానానికి తమ విన్నపాన్ని వెల్లడించారు. సానుకూలంగా స్పందించిన అధిష్టానం త్వరలోనే వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -