నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టిన సాయికుమార్ మొదటి నుండి ఆయనకు పాట అంటే ప్రాణం. అదే ఈరోజు ఆయనకు ఒక స్థాయి తెచ్చిపెట్టింది. సోమవారం తెలంగాణ ప్రభుత్వం తలపెట్టినటువంటి బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయ పాటలలో భాగంగా రాష్ట్రస్థాయిలో 500 ఎంట్రీలలో మొదటి బహుమతి ధర్పల్లి సాయికుమార్ పాటతో మంత్రులను మంత్రాముగ్దున్ని చేసి ఔరా అనిపించుకున్నాడు.
తన రచన, గానంతో సంస్కృతిక మంత్రి,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, డైరెక్టర్ దిల్ రాజు, మరో డైరెక్టర్ హరీష్ డైరెక్టర్ల చేతులమీదుగా సన్మానింపబడ్డాడు. సాధించడమయినది ఈ పాటకు రచన ధర్పల్లి సాయికుమార్, గానం లక్ష్మి కొయ్యూరు, సంగీతం విజయ్ ఐలేని అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి రావలసి ఉండగా.. ఆయన అసెంబ్లీ సమావేశాలలో ఉండడం వల్లా కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని తెలిసింది. కార్యక్రమములో నటుడు తనికెళ్ల భరణి, నటుడు అశోక్ రాజు, గాయకులు మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గాయకురాలు మోహన భోగరాజు, మ్యూజిక్ డైరెక్టర్ చరన్ అర్జున్, తెలంగాణ కవులు కళాకారులు పాల్గొన్నారు.



