Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ భవన నిర్మాణానికి శ్రీకారం

అంగన్వాడీ భవన నిర్మాణానికి శ్రీకారం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం రేగుల గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బూడిద పల్లి లో సర్పంచ్ పాగి ఆమని సురేష్, ఉపసర్పంచి పాలరావు వెంకటస్వామి సోమవారం నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పునాదిరాయి వేసి పనులు ప్రారంభించారు. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచి పాగే ఆమని సురేష్, ఉప సర్పంచ్ పాలరావు వెంకటస్వామి భవన నిర్మాణానికి నాంది పలికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కృష్ణవేణి, అంగన్వాడి టీచర్ ప్రమీల, గంగారం సెక్టార్ సూపర్ వైజార్ వీణ, పి ఆర్ డి ఈ సాయిలు, పి ఆర్ ఏ ఈ సతీష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ ముత్తయ్య, నాయకులు గంధం రాజు ,భీమరాజు,పొన్న నారాయణ,మొగిలి రాజకుమార్ యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -