Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నట్టల నివారణ మందులు పంపిణీ

నట్టల నివారణ మందులు పంపిణీ

- Advertisement -

బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. సోమవారం పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని గొర్రెలు మేకల పెంపకం దారులకు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పంపిణీ చేస్తున్నటువంటి నటన నివారణ మందులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వారి వారి గొర్రెలకు మేకలకు సరైన సమయంలో వాటికి పోసి కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. మేకలకు గొర్రెలకు ఇంకేమైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు తెలిపారు. లేనియెడల మండల కేంద్రంలోనున్న పశువైద్యాధికారిని సంప్రదించాలని కోరారు..ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మేకల-గొర్ల పెంపకం దారులు, గ్రామస్థులు, యువత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -