నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలం లోని మచ్కల్,చించాల,ఏడ్ బిడ్,బోరిగాం గ్రామం లోని ప్రభుత్వజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ తరుపున ట్రస్ట్ ఛైర్మెన్ మోహన్ రావ్ పటేల్ నేతృత్వంలో మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్ పటేల్ ఆధ్వర్యంలో సోమవారం పదవ తరగతి కి సంబంచి ఆల్ ఇన్ వన్ గైడ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజి ఎంపీపీ సుభాష్ జాదవ్ పటేల్ మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల కు సిద్దం అయ్యేందుకు ఈ మెటీరియల్ ను ఉచితంగా పంపిణీ చేస్తున్నమని తెలిపారు.
పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని జయిస్తూ విజయం సాధించాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు.చదివే మెళకువలు, అనుసరించాల్సిన విధానం గురించి తేలియజేశారు. కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.విద్యార్థులు పాఠశాల అధ్యాపకులు ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావ్ పటేల్ కు,మాజీఎంపిపి సుబాస్ జాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,పాఠశాల ఉపాధ్యాయులు, సర్పంచ్ ,ఉప సర్పంచ్ లు పత్తి రెడ్డి రాం చందర్ రెడ్డి, గంగాధర్,ఆత్మ స్వరూప్, కిష్టయ్య, సర్వేష్, అనూరాధ గణపతి, సాయినాథ్ గౌడ్,గోపాల్,మ్యాదరి భూమన్న, ట్రస్ట్ టీం సభ్యులు ముధోల్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



