Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరజక ఆత్మగౌరవ భవన స్థలం పరిరక్షణకు చర్యలు

రజక ఆత్మగౌరవ భవన స్థలం పరిరక్షణకు చర్యలు

- Advertisement -

”నవతెలంగాణ” కథనంపై స్పందించిన బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి
నివేదిక ఇవ్వాలని రజక ఫెడరేషన్‌ ఎండీకి ఆదేశాలు
ప్రభుత్వ కార్యదర్శితోపాటు ఇతర అధికారులను కలిసిన
రజక వృత్తిదారుల సంఘం నాయకులు
నవతెలంగాణ-బోడుప్పల్‌

రజక ఆత్మగౌరవ భవన స్థలం పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఈ. శ్రీధర్‌ అన్నారు. ‘రజకుల ఆత్మగౌరవ భవన స్థలంలో గుడిసెలు’ అనే శీర్షికతో మంగళవారం నవతెలంగాణ పత్రికలో ప్రచురితమైన కథనానికి బీసీ సంక్షేమ శాఖ అధికారులు స్పందించారు. స్థలాన్ని పరిరక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై నివేదిక ఇవ్వాలని రజక ఫెడరేషన్‌ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం రజక ఆత్మగౌరవ భవన నిర్మాణానికి మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలంలో స్థలం కేటాయించగా, అందులో ఇటీవల ఎనుముల రేవంత్‌రెడ్డి నగర్‌ పేరిట గుడిసెలు వెలిశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఈ.శ్రీధర్‌ (ఐఏఎస్‌), బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ బాల మాయాదేవి(ఐఏఎస్‌)ని మంగళవారం కలిసి సమస్యను వివరించారు. అదే విధంగా నవతెలంగాణ పత్రికలో వచ్చిన కథనాన్ని చూపించారు. దాంతో స్పందించిన వారు.. కబ్జాపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రజక ఫెడరేషన్‌ ఎండీ చంద్రశేఖర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రజక ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో కబ్జాకు ప్రయత్నించిన వారి వివరాలు, ఇతర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్థలం పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. భవనం నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చూస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య మాట్లాడుతూ.. రజక ఆత్మగౌరవ భవనం కోసం కేటాయించిన స్థలం కబ్జాపై స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వెంటనే స్థానిక అధికారులు రంగంలోకి దిగి గుడిసెలను తొలగించారన్నారు. ప్రభుత్వ కార్యదర్శి స్పందించి రక్షణ ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమన్నారు. అధికారులను కలిసిన వారిలో రజక వృత్తిదారుల సంఘం మేడ్చల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కార్యదర్శులు జ్యోతి ఉపేందర్‌, ఎం.గోపాల్‌, సి.మల్లేష్‌, మేడిపల్లి అధ్యక్షులు అంబే చక్రపాణి, సోషల్‌ మీడియా కన్వీనర్‌ పి.భాస్కర్‌, ఉప్పల్‌ జోన్‌ కన్వీనర్‌ సట్టు రవి, రాష్ట్ర నాయకులు కాశయ్య, యాదగిరి పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad