Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దాడులను ప్రోత్సహించడం సరైనది కాదు 

దాడులను ప్రోత్సహించడం సరైనది కాదు 

- Advertisement -

బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం
నవతెలంగాణ – రామారెడ్డి 

ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరని, అలాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తూ, భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నామని మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పడిగల శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం ముదెల్లి గ్రామ బి ఆర్ ఎస్ సర్పంచిగా గెలుపొందిన రంజిత్ పై , ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో ఓడిపోయిన అభ్యర్థి పై ట్రాక్టర్ తో దాడి చేయడం ఖండిస్తున్నామని తెలిపారు.

స్థానిక సంస్థలైన సర్పంచి ఎన్నికలు పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా జరిగే ఎన్నికలని, అధికార బలాన్ని ఉపయోగించి అధికారులను, పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కుట్రలు చేయడం సరైనది కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమేనని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని, బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇలాంటి దాడులను, గుండాయిజానీ ప్రోత్సహించలేదని తెలిపారు. దాడులు చేసిన వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేలా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బాధితులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పులి సుధాకర్, సిద్ధిరాములు, హనుమయోల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -