Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాములు మృతి సీపీఐ(ఎం)కు తీరని లోటు

రాములు మృతి సీపీఐ(ఎం)కు తీరని లోటు

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలోని గూడపూర్ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మునుగోటి రాములు మృతి పార్టీకి తీరం లోటు అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. సోమవారం రాములు దశదిన సందర్భంగా సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూడపూర్ గ్రామంలో పలు సమస్యల పైన సీపీఐ(ఎం) చేపట్టిన ఉద్యమాలలో రాములు కీలకపాత్ర పోషించే వారిని గుర్తు చేశారు. రాములు కుటుంబ సభ్యులకు సీపీఐ(ఎం) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, మండల కమిటీ సభ్యులు , వేముల లింగస్వామి, పగడాల కాంతయ్య, వంటెపాక , సిహెచ్ బిక్షం , పగిళ్ల యాదయ్య , వెంకన్న తదితరులున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -