నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ డివిజన్ లో ప్రజలు న్యూ ఇయర్ వేడుకలో జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ రాజశేఖర్ రాజు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డిసెంబర్ 31 రాత్రి 11 గంటలకు మూసివేయాలని వ్యాపారులకు సూచించారు. కేకు లు విక్రయించే బేకరి దుకాణాలు ముందుగానే మూసి వేయాలన్నారు.ముక్యంగా యువకులు మద్యం తాగి రోడ్లపైకి రావొద్దని, విధుల్లో, సెంటర్లో కేకులు బహిరంగనగా కట్ చేయొద్దన్నారు. ఎవరి ఇంట్లో వారే వేడుకలు జరుపుకోవాలన్నారు. ఆ రోజు రాత్రి ట్రిబుల్ రైడింగ్ చేస్తే కారిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి అంత డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, గంజాయి, డ్రగ్స్ పరీక్షలు చేస్తామన్నారు.
బాణాసంచులు కూడా కాల్చవద్దన్నారు. డీజే లు ఉపయోగించకూడని దానిపై నిషేధం ఉందన్నారు. శాంతియుతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని ఇవ్టీ జింగ్, మహిళను వేధించిన కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే చేసిన నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగరేసేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతారని, చైనా మంజా పై నిషేధం ఉందని పోలీసులు తనిఖీలు చేశారని చైనా మంజా అమ్మితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. గతంలో కంటే ఏడాది క్రైమ్ రేటు తగ్గిందని చెప్పారు. డివిజన్లో 221 చీటింగ్ కేసులు నమోదు చేశామన్నారు. గంజాయి పై ఉక్కు పాదం 18 కేసులు నమోదు చేసి 43 మందిని అరెస్టు చేశామన్నారు. మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదాల నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సిఐలు నాగభూషణం, పి ఎన్ డి ప్రసాద్, ఎస్ఐ లు రాంబాబు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.



