Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కంకర మిషన్ ఏర్పాటు చేయొద్దని ప్రజావాణిలో ఫిర్యాదు

కంకర మిషన్ ఏర్పాటు చేయొద్దని ప్రజావాణిలో ఫిర్యాదు

- Advertisement -

– తమ ఉపాధి పోతుందని ఆవేదన 
– అధికార స్పందించి తమకు సహాయం చేయాలంటున్న వడ్డెర కులస్తులు 
నవతెలంగాణ –  కామారెడ్డి

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం జనగామ గ్రామానికి చెందిన వడ్డెర కులస్థులు సోమవారం కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి తాము ఉపాధి పొందుతున్న చోట కంకర మిషన్ ఏర్పాటు చేస్తున్నారని ఆ కంకర మిషన్ ఏర్పాటు చేయకుండా చూడాలని సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వడ్డెరలు, రైతులు మాట్లాడుతూ మా జీవన మనుగడ కొరకు బండలు రాళ్లు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నామనీ,  మకు ఉపాధి లేకుండా కంకర మిషన్ వేస్తున్నారు కావున మా యందు దయతలచి మానవతా దృక్పథంతో ఆలోచించి అట్టి కంకర మిషన్ ను నిలిపివేయగలరని ప్రభుత్వనీ కోరుతున్నామన్నారు.

ప్రస్తుతం ఏర్పాటు చేయబోయే కంకర మిషన్ చుట్టూ దాదాపు 350 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని, కంకర మిషన్ వాళ్ళు చేసే (Under ground blasting) బ్లాస్టింగ్ వల్ల వ్యవసాయ భూములలో ఉన్నటువంటి బోరు బావులు దెబ్బతినే ప్రమాదం ఉన్నదనీ,  మేము వ్యవసాయ పనులు చేసుకోలేము అలాగే వాతావరణ కాలుష్యం ఏర్పడి కంకర మిషన్ డస్ట్ (West) ద్వారా పంటలు పండే అవకాశం లేదనీ, రైతు మనుగడ కష్టంగా మారుతుంది అన్నారు.   చుట్టూ ప్రక్కల వ్యవసాయ క్షేత్రాలను దృష్టిలో పెట్టుకొని  రైతుకు సహకారం అందించగలరని మా  రైతు మనుగడకు సహకరించి దేశ అభివృద్ధికి సహకరించగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -