Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ 

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్  షబ్బీర్ అలీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యం, ప్రమాదాలు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా మారిందని  మహమ్మద్ అలీ షబ్బీర్  పేర్కొన్నారు. 

వైద్య చికిత్సల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలబడటం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేకత అని ఆయన అన్నారు. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి వారికి భరోసా ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ విధానం అన్నారు. అవసరమైన సమయంలో సహాయం అందించడమే నిజమైన పాలన అని తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా నిజమైన లబ్ధిదారులకు సహాయం అందేలా అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలు, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు 50 లక్షలు రూపాయల చెక్కులను 82  మంది బాధితులకు ఈ చెక్కులు అందించామని, భవిష్యత్తులో  అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్‌ఎఫ్ మంజూరు అయ్యేలా తన వంతు కృషి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -