- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలోని కంసానిపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఎస్సీ కాలనీ, బీసీ కాలనీల్లో నెలకొన్న నీటి సమస్యలను గ్రామ సర్పంచ్ చీమర్ల లలిత వెంకటేశ్వర్లు పరిశీలించారు. సమస్య ఉన్న ప్రాంతాల్లో బోర్ మోటర్‌ను అమర్చించడంతో పాటు, మినీ వాటర్ ట్యాంకుల వద్ద పైపుల లీకేజీలను గుర్తించి కొత్త పైపులు ఏర్పాటు చేయించారు. దీంతో కాలనీల్లో నీటి ఇబ్బందులు తొలగినట్లు స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సురేష్, కారోబార్ సుల్తాన్, దాసు, నిరంజన్, వెంకటయ్య, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



