అభివృద్ధికి ప్రణాళికతో వెళ్తాం: సర్పంచ్ మానస
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని దాచారం గ్రామంలో 2024-25 కాలంలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై సోమవారం డీఆర్ పీ సంధ్య సామాజిక తనిఖీ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఉపాధి హామీ నిధుల ఖర్చులపై డీఆర్ పీ వివరాలు తెలిపారు. గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై పంచాయతీ పాలకవర్గం సభ్యులతో సమావేశం ఏర్పాటుచేసి ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామని సర్పంచ్ బైరీ మానస అన్నారు. పంచాయతీ కార్యదర్శి సురేశ్, ఉపసర్పంచ్ దీటి బాలనర్స్, వార్డ్ సభ్యులు గాదగోని అశోక్, బొర్ర మహేష్, సావనపెల్లి రాజు, దయ్యాల శ్రావణి కనగండ్ల సోని, బొడిగే వనిత, నేతి మహేష్, అమరగొండ రాజు, కనగండ్ల కవిత, గ్రామస్తులు పాల్గొన్నారు.
దాచారంలో సామాజిక తనిఖీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



