Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా చేప పిల్లల పంపిణీ

మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా చేప పిల్లల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్ 
మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా మత్స్య సంపదను పెంపొందించడానికి మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతుందని వడ్డేపల్లి సర్పంచ్ రాజాగారి రేణుక రాజా గౌడ్ అన్నారు. సోమవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో చెరువుల్లో చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు పేర్కొన్నారు. మత్స్య శాఖ అధికారి ప్రశాంత్ మాట్లాడుతూ, చేప పిల్లల పోషణతో చెరువుల ఉత్పాదకత పెరిగి మత్స్య సంపద విస్తరిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మత్స్య అభివృద్ధి పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే చెరువుల సంరక్షణ, చేపల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు కరుణాకర్, రవి, స్థానిక మత్స్యకారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -