Tuesday, December 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'పెద్ది'లో అప్పలసూరిగా..

‘పెద్ది’లో అప్పలసూరిగా..

- Advertisement -

రామ్‌ చరణ్‌ నటిస్తున్న రూరల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. వద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రామ్‌ చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్‌, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అప్పలసూరి పాత్రలో జగపతి బాబును పరిచయం చేస్తూ చిత్ర బృందం ఆయన ఫస్ట్‌-లుక్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో జగపతి బాబు ఇంటెన్స్‌ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఇది సినిమాలోని గ్రామీణ నేపథ్యానికి పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌. చెదిరిన సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ జుట్టు మునుపెన్నడూ చూడని రీతిలో కనిపిస్తూ, తన రఫ్‌ లుక్‌కు మరింత వన్నె తెచ్చారు జగపతిబాబు. దారంతో కట్టిన విరిగిన కళ్లద్దాలు ఆ పాత్ర యొక్క కఠినమైన వ్యక్తిత్వాన్ని, అప్పలసూరి పాత్ర డెప్త్‌ని ఇంటెన్స్‌గా ప్రజెంట్‌ చేశాయి. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కీ ప్రత్యేక ప్రాధాన్యం ఉండేలా దర్శకుడు బుచ్చిబాబు డిజైన్‌ చేశారు. బోమన్‌ ఇరానీ పాత్ర కూడా సినిమాకు కీలకంగా ఉంటుందని అని మేకర్స్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -