ప్రభాస్ నటిస్తున్న నూతన చిత్రం ‘రాజా సాబ్’. దర్శకుడు మారుతి. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా ట్రైలర్ 2.ఓని రిలీజ్ చేశారు. ఎన్నో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ప్యాకేజ్ చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని ‘రాజా సాబ్’ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. గంగమ్మ (జరీనా వాహబ్) ముద్దుల మనవడు రాజా సాబ్ (ప్రభాస్), అన్నీ మర్చిపోయే గంగమ్మ తన భర్త (సంజయ్ దత్)ను మర్చిపోలేకపోతుంది. ఓ మిస్టరీగా మారిన తాతను కలిసే సాహసానికి రాజా సాబ్ సిద్ధమవుతాడు.
అడుగు అడుగునా ప్రమాదాలు నిండి ఉన్న మయసభ లాంటి తాత భారీ హవేలీలోకి అడుగుపెడతాడు రాజాసాబ్. ఆ హవేలీలోకి వెళ్లిన వారిని ఎవరిని ఎలా వేటాడాలో డిజైన్ చేసి పెడతాడు తాత. హిప్టాటిజంతో పాటు దుష్ట శక్తులను శాసించగల తాత.. రాజా సాబ్, అతనితో వచ్చిన వారిని ఎలా ఇబ్బంది పెట్టాడు?, తాత సృష్టించిన ప్రమాదాల నుంచి రాజా సాబ్ ఎలా బయటపడ్డాడు?, తాను వెళ్లిన మిషన్‌ను రాజా సాబ్ కంప్లీట్ చేసుకున్నాడా, లేదా?, దేవనగర సంస్థ జమీందారిణి గంగాదేవి, సాధారణ మధ్య తరగతి గంగమ్మగా ఎందుకు జీవిస్తోంది? అనే అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది. మూవీ మేకింగ్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అల్టిమేట్ ప్యాషన్ మరోసారి ఈ ట్రైలర్‌తో ప్రూవ్ అయ్యిందని చిత్రయూనిట్ తెలిపింది.
సరికొత్త ట్రైలర్‌తో సర్‌ప్రైజ్ చేసిన ‘రాజా సాబ్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



