Tuesday, December 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనిమ్స్‌ ఉద్యోగులకు తీపి కబురు

నిమ్స్‌ ఉద్యోగులకు తీపి కబురు

- Advertisement -

– ఆర్జిత సెలవుల నగదు మార్పిడికి గ్రీన్‌ సిగల్‌
– రాష్ట్ర సర్కారు జీవో విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) ఉద్యోగుల ఎన్నో ఏండ్ల నిరీక్షణ ఫలించింది. వారు కోరుతున్నట్టుగా ‘ఆర్జిత సెలవుల నగదు మార్పిడి’ కి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవతో, నిమ్స్‌ ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం జీవో 230ను విడుదల చేసింది. ఎయిమ్స్‌ పే స్కేల్స్‌ పొందుతున్న నిమ్స్‌ రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం లేదు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాయి. ఇటీవల హాస్పిటల్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మంత్రికి తమ సమస్యను విన్నవించారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ, అధికారులతో చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న ‘తెలంగాణ లీవ్‌ రూల్స్‌-1933’ నిబంధనల ప్రకారమే ఇకపై నిమ్స్‌ ఉద్యోగులు కూడా తమ ఆర్జిత సెలవులను సరెండర్‌ చేసి నగదు పొందవచ్చు. ఈ మేరకు హెల్త్‌ సెక్రెటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తు సోమవారం జీవో విడుదల చేశారు. తమ కష్టాన్ని గుర్తించి, చిరకాల వాంఛను నెరవేర్చినందుకు మంత్రి దామోదర రాజనర్సి ంహకు నిమ్స్‌ ఉద్యోగవర్గాలు కృతజ్ఞతలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -