Tuesday, December 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅమెరికాలో రోడ్డు ప్రమాదం

అమెరికాలో రోడ్డు ప్రమాదం

- Advertisement -

ఇద్దరు తెలంగాణ యువతులు మృతి

గార్ల: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా గార్లకు చెందిన పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) మూడేండ్ల కిందట అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్‌ పూర్తిచేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నారు.
మేఘన, భావన సహా మొత్తం ఎనిమిది మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్‌కి బయల్దేరారు. ఈ క్రమంలో అలబామా హిల్స్‌ రోడ్డులో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. దీంతో వారిద్దరూ మృతి చెందారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యువతుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -