- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునే ఉత్తర ద్వారాన్ని తెరిచారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం వేడుక ప్రారంభమైంది. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రస్వామి వారు, గజ వాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి దర్శనమిచ్చారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి, విజయవాడ కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తారు.
- Advertisement -



