పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
మండల ఎంఈఓ లక్ష్మన్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణతయేలక్ష్యంగా మండలంలోని తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, రుద్రారం, వళ్లెంకుంట గ్రామాల్లోని జిల్లా పరిషత్ హైస్కూల్స్, దుబ్బపేటలోని కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల, ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో చదువుతున్న మొత్తం 195 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా మండల విద్యాశాఖ అధికారి లక్ష్మన్ బాబు తెలిపారు. విద్యార్థులుచదవాలనే తపన ఉంటే ఏ అంశంలోనైనా పట్టు సాధించవచ్చని, ఇదే స్ఫూర్తిగా విద్యార్థులు సాధన చేయాల్సిందిగా సూచించారు. పరీక్షల సమయంలోనే కాకుండా తరగతుల ప్రారంభం నుంచి ఒక ప్రణాళికతో చదవాలని అప్పుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు.
పదిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులు సన్నద్ధమవు తున్నారని తెలిపారు. గతేడాదికంటే ఈ సారి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత సాధిం చేందుకు ఉపాధ్యాయులు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేశారని పేర్కొన్నారు. అదే రీతిలో విద్యార్థులతో సాధన చేయించాలని ఉపాఫ్యాయులను ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయడంతో పాటు ప్రతీ రోజు రెండు గంటల పాటు ఉదయం, సాయంత్రం వేళ్లలో ప్రత్యేక తరగతులు స్టడీ అవర్స్,స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. రోజూ ఒక సబ్జెక్ట్కు సంబంధించిన ఉపాధ్యాయుడు ప్రత్యేక తరగతి నిర్వహణతో పాటు స్టడీ అవర్స్ విధులు నిర్వహిస్తారు. స్టడీ అవర్స్లో విద్యార్థులకు కలిగిన సందేహాలను నివృత్తి చేయడంతో విద్యార్థుల్లో మనోధైర్యం కలుగుతుంది. దీంతో ఎలాంటి భయం లేకుండా పరీక్షలకు హాజరై మంచి ఫలితాలు సాధిసారని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మార్గదర్శకాలు ఇలా..
ఉపాధ్యాయులు సిలబస్ ను జనవరి 10లోపు పూర్తి చేయాలి.ఆ తర్వాత రివిజన్ తరగతులు ప్రారంభించాలి.ఎస్ఏ-1 పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులను ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించాలి.సీ గ్రూప్ విద్యార్ధులకు పునశ్చరణ తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహించాలి.ప్రతీ ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకొని వారిని వ్యక్తిగతంగా మార్గదర్శనం చేయాలి.విద్యార్ధుల హాజరును 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా పర్యవేక్షణ చేయాలి.
సందేహాలను నివృత్తి చేస్తున్నాం: భవాని, ఎస్ఓ కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల
స్టడీ అవర్స్, ప్రత్యేక శిక్షణ తరగతులతో విద్యార్థుల్లో ఇంప్రూమెంట్ కనిపిస్తోంది. అలాగే స్టడీ అవర్స్ నిర్వహించడంతో ఏకాగ్రత దెబ్బతినకుండా చదువుపై శ్రద్ధ పెట్టడానికి విద్యార్థులకు వీలు కలుగుతుంది. విద్యార్ధులకు సందేహాలను నివృత్తి చేస్తున్నాం.
ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం: లక్ష్మన్ బాబు, ఎంఈఓ
పరీక్షల సమయంలోనే కాకుండా మొదటి నుంచి ప్రణాళికపరంగా పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలి. మండలంలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వ హిస్తున్నాం.



