- Advertisement -
మంత్రి శ్రీధర్ బాబుకు జీపీ కార్మికుల వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్రంలోని పంచాయతీ కారోబార్లు, సిబ్బంది సమస్యలను పరిస్కారం చేయాలని మంగళవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు జీపీ ఎంప్లాయిస్ యునైటెడ్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అన్నివర్గాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీపీ ఎంప్లాయిస్ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రావణ్, సతీష్, మురళి, శ్రీనివాస్, గంగారాం పాల్గొన్నారు.
- Advertisement -



