Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నట్టల నివారణకు రైతులు శ్రద్ధ చూపాలి 

నట్టల నివారణకు రైతులు శ్రద్ధ చూపాలి 

- Advertisement -

– జిల్లా అధికారి జ్ఞాన శేఖర్ 
నవతెలంగాణ – బల్మూర్

గొర్రెలు, మేకలలో వ్యాధులు సోకకుండా రైతులు శ్రద్ధ చూపాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞాన శేఖర్ తెలిపారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలలో మండల పశువైద్య అధికారి అనిల్ ఆధ్వర్యంలో ఉచిత నట్టల నివారణ వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్రామాలలో మేకలు గొర్ల కాపరుల రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గొర్రెలు మేకలలో వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్య సిబ్బందిని అధికారులను సంప్రదించాలని సలహాలు సూచనలు పొందాలని అన్నారు.

అప్పుడే రైతులు ఆర్థికంగా నష్టపోరని తెలిపారు. మండలంలోని పోలిశెట్టిపల్లి,అంబగిరి, మైలారం గ్రామాలలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు తాగించడం జరిగిందని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని నట్టల నివారణ మందులను ఇప్పించారని వైద్యాధికారి అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఈ కార్యక్రమంలో అంబగిరి సర్పంచ్ శ్రీను, పోలిశెట్టిపల్లి గ్రామ సర్పంచ్ ఆకారపు జోష్ణ , మైలారం సర్పంచ్ బంగారయ్య, డాక్టర్ మహేశ్వరి ,పారావేటర్నరీ సిబ్బంది ఛాయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -