నవతెలంగాణ – సదాశివపేట
నవతెలంగాణ దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. “అనుదినం జనస్వరం” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రజల సమస్యలను నిరంతరం ప్రతిబింబిస్తూ, ప్రజాపక్షంగా పనిచేస్తున్న దినపత్రిక నవతెలంగాణ అని ప్రశంసించారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ.. సామాన్యుల గొంతుకగా నిలుస్తూ వార్తలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తున్న నవతెలంగాణ పాత్ర అభినందనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడే విధంగా పత్రిక చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నవతెలంగాణ ఉమ్మడి మెదక్ జిల్లా రీజియన్ రేవంత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర యువజన నాయకులు కూన సంతోష్, బిట్ల ప్రేమ్ కుమార్, రాయపాడు రమేష్, వెంకన్న బాబు (లడ్డు), నవతెలంగాణ విలేకరి వీరేశం, నవతెలంగాణ సంగారెడ్డి జిల్లా డివిజన్ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్, జహీరాబాద్ డివిజన్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.



