Thursday, May 22, 2025
Homeజాతీయంనేడు రాజీవ్ గాంధీ వ‌ర్థంతి..రాహుల్ గాంధీ ఎమోష‌న‌ల్ ట్వీట్

నేడు రాజీవ్ గాంధీ వ‌ర్థంతి..రాహుల్ గాంధీ ఎమోష‌న‌ల్ ట్వీట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీలోని వీర్‌భూమిలో ఆయన సమాధి వద్ద రాహుల్ గాంధీ పుష్పగుచ్ఛాలు ఉండి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే తో పాటు పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా పాల్గొన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ తన తండ్రిని స్మరించుకుంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్) వేదికగా ఎమోషన్ ట్వీట్ చేశారు. ‘నాన్నా.. నీ జ్ఞాపకాలు ప్రతి అడుగులో నాకు మార్గదర్శనం చేస్తాయి. నీ పూర్తి కాని కలలను సాకారం చేయడమే నా సంకల్పం, వాటిని నేను నెరవేరుస్తా’. అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. త‌న పాల‌న‌లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకొని దేశ అభివృద్ధికి కృషి చేశార‌ని, 18 ఏండ్ల‌కే ఓటు హ‌క్కు, విప్ల‌వాత్మ‌క‌మైన ఐటీ పాల‌సీ, గ్రామ‌స్థాయిలో పాల‌న‌ను బ‌లోపేతం చేయ‌డానికి పంచాయ‌తీరాజ్ చ‌ట్టం రూప‌క‌ల్న‌న చేశార‌ని ఖ‌ర్గే గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -