నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం మొదటి సమావేశాన్ని సర్పంచ్ కంపదని అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. పంచాయతీకి నిధులు సమకూరిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం పంచాయతీ పాలకవర్గ సభ్యులు స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో, అంగన్వాడి కేంద్రంలో సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ ఉల్లెంగుల శశిధర్, పంచాయతీ ఖాందేశ్ కార్యదర్శి సంధ్య, వార్డు సభ్యులు బషీరి సురేష్, చిడబోయిన మధు, బాసకొండ దేవేందర్, ఉల్లెంగుల సుజాత, మామిడి ఆమని, ఈర్నాల లక్ష్మి, రాథోడ్ జ్యోతి, అంగన్వాడి టీచర్, ఆశా కార్యకర్త, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



