Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ వి గార్డెన్ పై ప్రజావాణిలో ఫిర్యాదు

ఎస్ వి గార్డెన్ పై ప్రజావాణిలో ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న ఎస్ వి గార్డెన్ పై వార్డు సభ్యులు రాజు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఫంక్షనల్ నిర్వహిస్తూ గ్రామపంచాయతీకి టాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్న ఫంక్షన్ హాల్ పై జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అనంతరం స్పందించిన డిపిఓ ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫంక్షనల్ పై  పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఫంక్షన్ హాల్ నిబంధన ప్రకారం నిర్వహిస్తూ పూర్తి టాక్స్ చెల్లించే వరకు వదిలే ప్రసక్తి లేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -