యూరియా సరఫరాలో ఇబ్బందులు లేవు
– మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను మంగళవారం నాడు మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ రిజిష్టర్లును పరిశీలించారు. ఎరువుల దుకాణాలలో ప్రతీ రోజు యూరియా అమ్మకాలు ఈ పాస్ మిషన్ ద్వారానే జరగాలని,యాసంగి సీజన్ కు సరిపడా యూరియా, ఇతర ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని యూరియా సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని తెలియజేశారు. ఆలేరు మండలంలో కో-ఆపరేటివ్ సొసైటీలు మరియు ప్రైవేటు డీలర్ల దగ్గర మొత్తం 45 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. రైతులు ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వాడాలని అధిక మోతాదులో వాడడం వలన పంట పొలాలకు చీడపీడల సమస్య అధికమవుతుందని తెలియజేశారు. పంటకు కావలసిన ఎరువులను ఒకేసారి కాకుండా మూడు దఫాలుగా వేసుకోవడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
రైతులకు యూరియా అందుబాటులో ఉంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



